ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారీ బడ్జెట్ తో 'తమ్ముడు' యాక్షన్‌ సీక్వెన్స్‌

cinema |  Suryaa Desk  | Published : Thu, Apr 25, 2024, 03:05 PM



టాలీవుడ్ నటుడు నితిన్ వేణు శ్రీరామ్‌తో ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి మూవీ మేకర్స్ 'తమ్ముడు' అనే టైటిల్ ని లాక్ చేసారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, హైదరాబాద్‌లో 8 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాలోని యాక్షన్‌ సీక్వెన్స్‌ ని మూవీ మేకర్స్ చిత్రీకరిస్తున్నారు.

ఈ సినిమాలో కథానాయిక, ఇతర కీలక నటీనటులను త్వరలో మూవీ మేకర్స్ ప్రకటిస్తారు. ఈ సినిమాలో లయ కీలక పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రానికి అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు. దిల్ రాజు తన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com