ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న 'కృష్ణమ్మ' టీమ్

cinema |  Suryaa Desk  | Published : Thu, Apr 25, 2024, 03:13 PM



వివి గోపాలకృష్ణ దర్శకత్వంలో టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్ ఒక సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి కృష్ణమ్మ అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు.


ఈ చిత్రం మే 3న ప్రేక్షకులని అలరించటానికి సిద్ధంగా ఉంది. తాజాగా మూవీ మేకర్స్ ఈరోజు ఈ సినిమా ప్రొమోషన్స్ లో భాగంగా విజయవాడలోని కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు తీసుకున్నారు.

ఈ యాక్షన్ క్రైమ్ డ్రామాలో సత్య దేవ్ సరసన జోడిగా అతిరా రాజి నటిస్తుంది. అరుణాచల క్రియేషన్స్ బ్యానర్‌పై కృష్ణ కొమ్మాలపాటి ఈ సినిమాని నిర్మించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com