ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'ది 100' టీజర్ ని విడుదల చేయనున్న మెగా మదర్

cinema |  Suryaa Desk  | Published : Thu, Apr 25, 2024, 08:35 PM



మొగలి రేకులు సీరియల్‌లో తన పాత్రకు ప్రసిద్ధి చెందిన ఆర్‌కె సాగర్, రాఘవ్ ఓంకార్ శశిధర్ రచన మరియు దర్శకత్వం వహించిన 'ది 100' అనే కొత్త చిత్రంలో నటించనున్నారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా టీజర్ ని రేపు ఉదయం 10:31 గంటలకి మెగా మదర్ కొణిదెల అంజనా దేవి గారు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు.

ఈ సినిమాలో మిషా నారంగ్ కథానాయికగా నటిస్తుండగా, ధన్య బాలకృష్ణ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా శ్యామ్ కె నాయుడు, సంగీత దర్శకుడిగా హర్షవర్ధన్ రామేశ్వర్ మరియు ఎడిటర్‌గా అమర్ రెడ్డి కుడుముల ఉన్నారు.  ఈ చిత్రానికి చిన్నా ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తుండగా, సుధీర్ వర్మ పేరిచర్ల డైలాగ్స్ రాశారు.


ఆర్కే సాగర్ ఈ సినిమాలో ఇంటెన్స్ పోలీస్ పాత్రలో కనిపించనున్నాడు. KRIA ఫిల్మ్ కార్ప్ మరియు ధమ్మ ప్రొడక్షన్స్ పతాకాలపై రమేష్ కరుటూరి, వెంకీ పూషాడపు మరియు జె తారక్ రామ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com