ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హరోమ్‌హర : అన్ని మ్యూజిక్ ప్లాట్‌ఫారమ్‌లలో స్ట్రీమింగ్ అవుతున్న 'కనులెందుకో' సాంగ్

cinema |  Suryaa Desk  | Published : Thu, Apr 25, 2024, 08:47 PM



జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో నైట్రో స్టార్ సుధీర్ బాబు ప్రస్తుతం తన తదుపరి చిత్రాన్ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి చిత్ర బృందం 'హరోమ్ హర' అనే టైటిల్ ని లాక్ చేసింది. ఈ సినిమా టీజర్ మూవీపై భారీ బజ్ ని క్రియేట్ చేసింది. ఇటీవలే మూవీ మేకర్స్ ఈ సినిమాలోని సెకండ్ సింగల్ ని కనులెందుకో అనే టైటిల్ తో విడుదల చేసారు. తాజాగా చిత్ర బృందం ఈ మెలోడీ సాంగ్ అన్ని మ్యూజిక్ ప్లాట్‌ఫారమ్‌లలో స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చినట్లు ప్రకటించారు.

ఈ ప్రాజెక్ట్‌లో మాళవిక శర్మ కథానాయికగా నటించింది. సునీల్, జయ ప్రకాష్, అక్షర, అర్జున్ గౌడ, లక్కీ లక్ష్మణ్, రవి కాలే మరియు ఇతరులు ఈ సినిమాలో కీలక పాత్రలలో కనిపించనున్నారు. చైతన్ భరద్వాజ్ ఈ చిత్రానికి సంగీత అందిస్తున్నారు. శ్రీ సుబ్రమణ్యేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై సుమంత్ నాయుడు ఈ సినిమాని నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com