ట్రెండింగ్
Epaper    English    தமிழ்

OTT ఎంట్రీ తేదీని లాక్ చేసిన 'డియర్'

cinema |  Suryaa Desk  | Published : Fri, Apr 26, 2024, 03:11 PM



ఆనంద్ రవిచంద్రన్ దర్శకత్వంలో జివి ప్రకాష్ కుమార్ నటించిన 'డియర్' సినిమా ఏప్రిల్ 12న విడుదల అయ్యింది. అన్నపూర్ణ స్టూడియోస్ ఈ చిత్రాన్ని ఆంధ్రా ప్రాంతంలో విడుదల చేయగా, ఏషియన్ సినిమాస్ తెలంగాణ ప్రాంతంలో విడుదల చేసింది. ఈ సినిమా యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని నెట్ఫ్లిక్ సొంతం చేసుకుంది. తాజాగా ఇప్పుడు ఈ సినిమా ఏప్రిల్ 28న స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రానున్నట్లు సమాచారం.


ఫ్యామిలీ కామెడీ డ్రామా ట్రాక్ లో వచ్చిన ఈ చిత్రంలో జివి ప్రకాష్ కుమార్  కి జోడిగా ఐశ్వర్య రాజేష్ నటిస్తుంది. ఈ సినిమాని వరుణ్ త్రిపురనేని, అభిషేక్ రామిశెట్టి మరియు జి పృథ్వీరాజ్ జాజికాయ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై నిర్మించారు. ఈ చిత్రంలో కాళి వెంకట్, ఇళవరసు, రోహిణి, తలైవాసల్ విజయ్, గీతా కైలాసం మరియు నందిని కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి జివి ప్రకాష్ కుమార్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com