ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'ఆ ఒక్కటి అడక్కు' లోని మెలోడియస్ సాంగ్ హమ్మమ్మో అవుట్

cinema |  Suryaa Desk  | Published : Fri, Apr 26, 2024, 05:46 PM



మల్లి అంకం దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అల్లరి నరేష్ తన తదుపరి చిత్రాన్ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ 'ఆ ఒక్కటి అడక్కు' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ సినిమా మే 3న విడుదల కానుంది.


తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమాలోని హమ్మమ్మో అనే సాంగ్ విడుదల చేశారు. గోపి సుందర్ స్వరపరిచిన ఈ మెలోడిక్ ట్రాక్‌లో యశస్వి కొండేపూడి యొక్క గానం మరియు భాస్కరభట్ల అద్భుతమైన సాహిత్యం అందరిని ఆకట్టుకున్నాయి.

ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా నరేష్ కి జోడిగా నటిస్తుంది. ఈ సినిమాలో అరియానా మరియు హర్ష చెముడు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ప్రాజెక్ట్‌కి గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నారు. చిలక ప్రొడక్షన్స్ పై రాజీవ్ చిలక ఈ సినిమాని నిర్మించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com