ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'స్వాగ్' కోసం డబ్బింగ్ మోడ్‌లో రీతూ వర్మ

cinema |  Suryaa Desk  | Published : Mon, Apr 29, 2024, 06:58 PM



సమాజవరగమన ఘనవిజయం తర్వాత నటుడు శ్రీవిష్ణు రాజా రాజా చోరాకు దర్శకత్వం వహించిన హసిత్ గోలితో తన తదుపరి ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం రాజా రాజా చోరాకు ప్రీక్వెల్‌గా వస్తున్నట్లు సమాచారం. ఈ కామెడీ ఫాంటసీ డ్రామాకి స్వాగ్ అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ సినిమా యొక్క అనౌన్స్మెంట్  వీడియో అభిమానులలో చాలా సంచలనం సృష్టించింది.


ఈ సినిమాలో రీతూ వర్మ కథానాయికగా నటిస్తుంది. తాజా సమాచారం ఏమిటంటే, రీతూ వర్మ ప్రస్తుతం ఈ సినిమాలో తన పాత్ర అయిన రుక్మిణి దేవికి డబ్బింగ్ చెప్తున్నట్లు ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసారు. ఈ చిత్రంలో శ్రీవిష్ణు నాలుగు విభిన్నమైన అవతారాలలో కనిపించనున్నట్లు లేటెస్ట్ బజ్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాని నిర్మిస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com