ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపు రివీల్ కానున్న 'గుడ్ బ్యాడ్ అగ్లీ' అప్డేట్

cinema |  Suryaa Desk  | Published : Tue, Apr 30, 2024, 02:25 PM



అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ తన తదుపరి సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 'గుడ్ బ్యాడ్ అగ్లీ' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ సినిమాలో అజిత్ కి జోడిగా గ్లామర్ బ్యూటీ శ్రీ లీల నటిస్తున్నట్లు లేటెస్ట్ టాక్.


తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమాకి సంబందించిన కీలక అప్డేట్ ని రేపు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. రేపు నటుడి పుట్టినరోజు కావడంతో ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేయవచ్చని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. గుడ్ బ్యాడ్ అగ్లీ 2025 పొంగల్‌కి గ్రాండ్‌గా విడుదల కానుంది.


ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించనున్నారు. టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్‌ పై నవీన్‌ యెర్నేని, రవిశంకర్‌ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com