ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'కృష్ణమ్మ' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి టైమ్ లాక్

cinema |  Suryaa Desk  | Published : Tue, Apr 30, 2024, 02:38 PM



వివి గోపాలకృష్ణ దర్శకత్వంలో టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్ ఒక సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి కృష్ణమ్మ అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ సినిమా మే 10, 2024న విడుదల కానుంది. ఈ యాక్షన్ క్రైమ్ డ్రామాలో సత్య దేవ్ సరసన జోడిగా అతిరా రాజి నటిస్తుంది.
 
తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఈరోజు సాయంత్రం 6 గంటలకి హైదరాబాద్ లోని హైటెక్ సిటీలో ట్రైడెంట్ హోటల్ లో నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సొషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. అరుణాచల క్రియేషన్స్ బ్యానర్‌పై కృష్ణ కొమ్మాలపాటి ఈ సినిమాని నిర్మించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com