ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'హరి హర వీర మల్లు' అప్డేట్ విడుదలకి టైమ్ లాక్

cinema |  Suryaa Desk  | Published : Tue, Apr 30, 2024, 02:47 PM



క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ "హరి హర వీర మల్లు" సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసందే. గత కొంత కాలంగా తన రాజకీయ కమిట్‌మెంట్స్‌తో బిజీగా ఉన్నందున ఈ సినిమా షూటింగ్ తాత్కాలికంగా నిలిపివేయబడింది. ప్రస్తుతం ఈ సినిమా యొక్క హై-ఎండ్ VFX పనులు శరవేగంగా జర్గుతున్నట్లు సమాచారం.


తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమాకి సంబందించిన కీలక అప్డేట్ ని మే 2, 2024న ఉదయం 9 గంటలకి విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది.


ఈ సినిమాలో బాబీ డియోల్, అర్జున్ రాంపాల్, సిజ్లింగ్ బ్యూటీ నోరా ఫతేహి ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఈ పాన్-ఇండియా మూవీని మెగా సూర్య ప్రొడక్షన్ నిర్మిస్తుండగా, ఎంఎం కీరవాణి సంగీతం అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com