ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'లవ్‌గురు' డిజిటల్ ఎంట్రీకి తేదీ ఖరారు

cinema |  Suryaa Desk  | Published : Tue, Apr 30, 2024, 03:14 PM



వినాయక్ వైద్యనాథన్ దర్శకత్వంలో విజయ్ ఆంటోనీ నటించిన రోమియో చిత్రం ఏప్రిల్ 11న విడుదల అయ్యింది. ఈ చిత్రం యొక్క తెలుగు వెర్షన్ ని 'లవ్ గురు' అనే టైటిల్ తో తెలుగురాష్ట్రాలలో మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ విడుదల చేసారు. ఈ సినిమా యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని ఆహా సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే.


తాజాగా ఇప్పుడు ఈ సినిమా మే 3, 2024న డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలో స్ట్రీమింగ్ ప్లాట్ఫారం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనుంది. ఈ సినిమాలో మృణాళిని రవి కథానాయికగా నటిస్తోంది. మీరా విజయ్ ఆంటోనితో కలిసి విజయ్ ఆంటోని తన బ్యానర్ విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పొరేషన్‌పై ఈ సినిమాని నిర్మించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com