ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ తేదీన జపాన్‌లో విడుదల కానున్న ప్రభాస్ 'సాలార్'

cinema |  Suryaa Desk  | Published : Thu, May 02, 2024, 05:44 PM



పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్, శృతి హాసన్ నటించిన సాలార్: పార్ట్ 1 డిసెంబర్ 22, 2023న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ని జపాన్ అంతటా మూవీ ట్విన్ 2 థియేటర్లలో విడుదల చేస్తుంది. తాజగా మూవీ మేకర్స్ ఈ ఎపిక్ యాక్షన్ సాగా యొక్క జపనీస్ వెర్షన్ జూలై 7, 2024న తెరపైకి రానున్నట్లు ప్రకటించారు.


యాక్షన్ థ్రిల్లర్ ట్రాక్ లో వచ్చిన ఈ సినిమాలో శృతి హాసన్, జగపతిబాబు, పృథ్వీరాజ్ సుకుమారన్, ఈశ్వరీ రావు, పొగరు ఫేమ్ శ్రీయా రెడ్డి, బ్రహ్మాజీ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి రవి బస్రూర్  సంగీతాన్ని అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com