ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'రత్నం' OTT అరంగేట్రం అప్పుడేనా?

cinema |  Suryaa Desk  | Published : Thu, May 02, 2024, 05:50 PM



భరణి, పూజ తర్వాత మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ల స్పెషలిస్ట్ హరితో కోలీవుడ్ స్టార్ హీరో  విశాల్ నటించిన రత్నం సినిమా ఏప్రిల్ 26, 2024న విడుదల అయ్యింది. ఈ సినిమా యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే.


తాజాగా ఇప్పుడు ఈ సినిమా ప్రైమ్ వీడియోలో మే 24, 2024న స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలో స్ట్రీమింగ్ ప్లాట్ఫారం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనుంది.

ఈ సినిమాలో విశాల్ కి జోడిగా ప్రియా భవానీ శంకర్ నటిస్తుంది. ప్రముఖ తమిళ నటుడు-చిత్ర నిర్మాతలు సముద్రఖని మరియు గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఈ సినిమాలో  కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కార్తెకేన్ సంతానం, జీ స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com