ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'భగవంత్ కేసరి' తమిళ వెర్షన్ డిజిటల్ ఎంట్రీకి తేదీ లాక్

cinema |  Suryaa Desk  | Published : Thu, May 02, 2024, 06:26 PM



టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటసింహ నందమూరి బాలకృష్ణ నటించిన 'భగవంత్ కేసరి' సినిమా అక్టోబర్ 19, 2023న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ అయ్యింది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ యాక్షన్-ప్యాక్డ్ ఎమోషనల్ డ్రామా తమిళంలో మే 3 నుండి సింప్ల్య్ సౌత్ అప్ లో ప్రసారం కానున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు.


ఈ బిగ్గీలో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా, శ్రీలీల, బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి మరియు హరీష్ పెద్ది అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఎస్ఎస్ థమన్ సంగీతం అందించనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com