ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లవ్ మి - ఇఫ్ యు డేర్ UK రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్

cinema |  Suryaa Desk  | Published : Thu, May 02, 2024, 06:51 PM



రౌడీ బాయ్స్‌లో తన పాత్రతో పేరు తెచ్చుకున్న ఆశిష్ రెడ్డి ఇటీవల నూతన దర్శకుడు అరుణ్ భీమవరపు దర్శకత్వంలో ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకు లవ్ మి - ఇఫ్ యు డేర్ అనే టైటిల్ ని లాక్ చేసారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా  UK రైట్స్ ని డ్రీమ్స్ ఎంటర్టైన్మెంట్స్ సొంతం చేసుకున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు.


ఈ సినిమా మే 25, 2024న విడుదల కానుంది. వైష్ణవి చైతన్య, ఈ సినిమాలో ఆశిష్ రెడ్డి సరసన నటించనుంది. దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హర్షిత్ రెడ్డి, హన్షితారెడ్డి, నాగ మల్లిడి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆస్కార్ విన్నింగ్ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com