ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఐటెం సాంగ్ కి రెడీ అవుతున్న శ్రీముఖి

cinema |  Suryaa Desk  | Published : Fri, May 03, 2024, 11:52 AM



ఫస్ట్ టైం ఐటమ్ సాంగ్ చేయనుందట శ్రీముఖి. ఓ స్టార్ హీరో సినిమాలో ఆమెకు ఛాన్స్ దక్కిందట. సిల్వర్ స్క్రీన్ పై క్రేజీ ఆఫర్స్ వస్తున్న నేపథ్యంలో ఆమె యాంకరింగ్ కి గుడ్ బై చెప్పేస్తుందంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. స్టార్ యాంకర్ గా బుల్లితెరను షేక్ చేస్తుంది శ్రీముఖి. ముఖ్యంగా స్టార్ మా లో సందడి మొత్తం ఆమెదే. ఒకటికి రెండు షోలు చేస్తూ దూసుకుపోతుంది. అయితే శ్రీముఖి టార్గెట్ మాత్రం నటిగా ఎదగడమే నట. అసలు శ్రీముఖి పరిశ్రమకు వచ్చింది హీరోయిన్ కావాలని అట. ఆఫర్స్ కోసం ప్రయత్నాలు చేస్తున్న రోజుల్లో శ్రీముఖికి క్యాస్టింగ్ కౌచ్ అనుభవాలు ఎదురయ్యాయట. దాంతో యాంకరింగ్ వైపు అడుగులు వేసిందట. యాంకర్ గా ఇమేజ్ వచ్చాక శ్రీముఖి పలు చిత్రాల్లో నటించింది. అయితే అవన్నీ చిన్న చిన్న పాత్రలు మాత్రమే. క్రేజీ అంకుల్స్ మూవీలో శ్రీముఖి హీరోయిన్ రోల్ చేయడం విశేషం.ఆ చిత్రం ఆశించిన స్థాయిలో ఆడలేదు. స్మాల్ బడ్జెట్ చిత్రాల్లో శ్రీముఖికి ఆఫర్స్ వస్తున్నాయట. అలాంటి చిత్రాలలో నటించడం వలన ప్రయోజనం లేదని శ్రీముఖి డిసైడ్ అయ్యిందట. అందుకే బ్రేక్ ఇచ్చే సినిమా కోసం ఆమె ఎదురు చుస్తున్నారట. కాగా ఆమెకు ఓ భారీ మూవీలో ఐటెం సాంగ్ చేసే ఆఫర్ వచ్చిదంటూ ఓ న్యూస్ తెరపైకి వచ్చింది. చిరంజీవి హీరోగా దర్శకుడు వశిష్ట తెరకెక్కిస్తున్న విశ్వంభర చిత్రంలో ఓ మాస్ ఐటెం సాంగ్ ఉందట. ఈ సాంగ్ లో చిరంజీవికి జంటగా శ్రీముఖిని ఎంపిక చేశారట. ఈ మేరకు ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అయితే ఎలాంటి అధికారిక సమాచారం లేదు. శ్రీముఖి తోటి యాంకర్స్ అనసూయ భరద్వాజ్, రష్మీ గౌతమ్ ఐటెం సాంగ్స్ చేశారు. శ్రీముఖి మాత్రం చేయలేదు. కాగా చిరంజీవి గత చిత్రం భోళా శంకర్ తో శ్రీముఖి కొన్ని ప్రత్యేకమైన సీన్స్ లో రొమాన్స్ చేసింది.ఐటెం భామగా శ్రీముఖి సక్సెస్ అయితే.. ఆమెకు సిల్వర్ స్క్రీన్ ఆఫర్స్ వెల్లువెత్తుతాయి. అప్పుడు ఆమె అనసూయ మాదిరి యాంకరింగ్ కి గుడ్ బై చెప్పే అవకాశం లేకపోలేదు. మరి చూడాలి శ్రీముఖి కెరీర్ ఎలాంటి మలుపు తిరుగుతుందో..


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com