ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'గం గం గణేశ' సెకండ్ సింగల్ విడుదలకి తేదీ ఖరారు

cinema |  Suryaa Desk  | Published : Fri, May 03, 2024, 03:24 PM



నూతన దర్శకుడు ఉదయ్ శెట్టి దర్శకత్వంలో నటుడు ఆనంద్ దేవరకొండ ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి మూవీ మేకర్స్ 'గం గం గణేశ' అనే టైటిల్ ని లాక్ చేసారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమాలోని సెకండ్ సింగిల్ ని పిచ్చిగా నాచెసేవే అనే టైటిల్ తో రేపు 12:06కి విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్రబృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది.

ప్రగతి శ్రీవాస్తవ, కరిష్మా, వెన్నెల కిషోర్ మరియు జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ ఈ చిత్రంలో ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. హైలైఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి చైతన్ భరద్వాజ్ సంగీతం అందించారు. ఈ సినిమా మే 31, 2024న విడుదల కానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com