ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గేమ్ ఛేంజర్ : చెన్నై నుండి హైదరాబాద్ తిరిగి వచ్చిన రామ్ చరణ్

cinema |  Suryaa Desk  | Published : Fri, May 03, 2024, 04:15 PM



సెన్సషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన 15వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి గేమ్ ఛేంజర్ అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ కథానాయికగా నటిస్తోంది.

కొద్ది రోజుల క్రితం రామ్ చరణ్ రెండు రోజుల షూటింగ్ కోసం చెన్నై వెళ్లాడు. నటుడు షూట్‌ను పూర్తి చేసి ఈ రోజు హైదరాబాద్‌కు తిరిగి వచ్చాడు. తదుపరి షెడ్యూల్ వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి. 2024 సమ్మర్‌లో ఈ సినిమా పెద్ద స్క్రీన్‌లపైకి వచ్చే అవకాశం ఉంది.

అరవింద్ స్వామి, ఎస్‌జే సూర్య, సురేష్ గోపి, ఈషా గుప్తా, అంజలి, శ్రీకాంత్, జయరామ్, సునీల్, హ్యారీ జోష్ మరియు నవీన్ చంద్ర ఈ సినిమాలో కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఈ మెగా చిత్రానికి థమన్ ఎస్ సౌండ్‌ట్రాక్స్ అందించనున్నారు. దిల్ రాజు తన హోమ్ బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై ఈ సినిమాని నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com