ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'ఆవేశం' OTT అరంగేట్రం అప్పుడేనా?

cinema |  Suryaa Desk  | Published : Fri, May 03, 2024, 06:19 PM



మాలీవుడ్ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ నటించిన 'ఆవేశం' సినిమా బాక్స్ఆఫీస్ వద్ద తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. ఈ సినిమా 100 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి ఈ ఘనత సాధించిన 7వ మాలీవుడ్ చిత్రంగా నిలిచింది. జిత్తు మాధవన్ రచన మరియు దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ డ్రామా యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే.


తాజాగా ఇప్పుడు ఈ సినిమా మే 9, 2024న స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అన్వర్ రషీద్ ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫహద్ ఫాసిల్ అండ్ ఫ్రెండ్స్ నిర్మించిన ఈ చిత్రంలో హిప్‌స్టర్, రోషన్ షానవాస్, మిథున్ జై శంకర్, సజిన్ గోపు మరియు మన్సూర్ అలీ ఖాన్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి సుశీన్ శ్యామ్ సౌండ్‌ట్రాక్ అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com