ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'హరోమ్‌హర' డబ్బింగ్ ని పూర్తి చేసిన సుధీర్ బాబు

cinema |  Suryaa Desk  | Published : Sat, May 04, 2024, 03:46 PM



జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో నైట్రో స్టార్ సుధీర్ బాబు ప్రస్తుతం తన తదుపరి చిత్రాన్ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి చిత్ర బృందం 'హరోమ్ హర' అనే టైటిల్ ని లాక్ చేసింది. ఈ సినిమా టీజర్ మూవీపై భారీ బజ్ ని క్రియేట్ చేసింది. ఈ సినిమా మే 31, 2024న విడుదల కానుంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా డబ్బింగ్ ని సుధీర్ బాబు పూర్తి చేసినట్లు సోషల్ మీడియాలో స్పెషల్ వీడియోని విడుదల చేసి అధికారకంగా ప్రకటించారు.


ఈ ప్రాజెక్ట్‌లో మాళవిక శర్మ కథానాయికగా నటించింది. సునీల్, జయ ప్రకాష్, అక్షర, అర్జున్ గౌడ, లక్కీ లక్ష్మణ్, రవి కాలే మరియు ఇతరులు ఈ సినిమాలో కీలక పాత్రలలో కనిపించనున్నారు. చైతన్ భరద్వాజ్ ఈ చిత్రానికి సంగీత అందిస్తున్నారు. శ్రీ సుబ్రమణ్యేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై సుమంత్ నాయుడు ఈ సినిమాని నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com