ట్రెండింగ్
Epaper    English    தமிழ்

150 కోట్ల మార్క్ దిశగా ఫహద్ ఫాసిల్ 'ఆవేశం'

cinema |  Suryaa Desk  | Published : Sat, May 04, 2024, 04:24 PM



మలయాళ బహుముఖ నటుడు ఫహద్ ఫాసిల్ ఆవేశంతో తన కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌ని సాధించాడు. ఈ సినిమా కేరళ బాక్సాఫీస్ వద్ద 25 రోజులలో 1 కోటికి పైగా వసూళ్లు చేసింది. ఫహద్ ఫాసిల్ యొక్క ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ ఆవేశం సక్సెస్ కి ప్లస్ పాయింట్ గా నిలిచింది.


ఈ సినిమా ప్రపంచ బాక్సాఫీస్ వద్ద 150 కోట్ల గ్రాస్ దిశగా దూసుకుపోతుంది. ప్రస్తుతం ఈ సినిమా కలెక్షన్లు 141 కోట్లు కాగా మరికొద్ది రోజుల్లోనే ఈ సినిమా 150 కోట్ల మార్క్‌ను అధిగమించే అవకాశం ఉంది. మే 9న ఆవేశం ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కి అందుబాటులోకి  రానుంది.


రోషన్ షానవాస్, మిథున్ జై శంకర్, సజిన్ గోపు, మన్సూర్ అలీ ఖాన్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. జిత్తు మాధవన్ ఈ యాక్షన్ కామెడీ ఎంటర్‌టైనర్‌కి రచయిత మరియు దర్శకుడు. ఈ చిత్రాన్ని న్వర్ రషీద్ ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫహద్ ఫాసిల్ అండ్ ఫ్రెండ్స్ సంయుక్తంగా నిర్మించారు. సుశిన్ శ్యామ్ ఈ సినేమాకియ సంగీతం అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com