ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'భజే వాయు వేగం' ఫస్ట్ సింగల్ విడుదలకి తేదీ లాక్

cinema |  Suryaa Desk  | Published : Mon, May 06, 2024, 02:39 PM



నూతన దర్శకుడు ప్రశాంత్ రెడ్డి దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ తన తదుపరి ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి 'బజే వాయు వేగం' అనే టైటిల్ ని మూవీ మేక్స్ లాక్ చేసారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌, టీజర్ సినిమాపై భారీ బజ్ ని క్రియేట్ చేసింది.


తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క ఫస్ట్ సింగల్ ని సెట్ అయ్యిందే అనే టైటిల్ తో మే 9న ఉదయం 9:09 గంటలకి విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది.


ఈ సినిమాలో ఐశ్వర్యా మీనన్ కథానాయికగా నటిస్తుంది. హ్యాపీడేస్ ఫేమ్ రాహుల్ టైసన్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాని యువి క్రియేషన్స్ సమర్పణలో యువి కాన్సెప్ట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి రధన్ సంగీతం సమకూర్చనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com