ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'సుందరం మాస్టర్' స్మాల్ స్క్రీన్ ఎంట్రీకి తేదీ లాక్

cinema |  Suryaa Desk  | Published : Mon, May 06, 2024, 03:35 PM



కళ్యాణ్ సంతోష్ దర్శకత్వంలో కమెడియన్ హర్ష చెముడు నటించిన 'సుందరం మాస్టర్' సినిమా ఫిబ్రవరి 23, 2024న విడుదల అయ్యింది. ఈ సినిమా యొక్క శాటిలైట్ రైట్స్ ని ప్రముఖ ఈటీవీ ఛానల్ సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా మే 12, 2024న సాయంత్రం 6:30 గంటలకి వరల్డ్ టెలివిషన్ ప్రీమియర్ గా ప్రదర్శించబడుతుంది.

ఈ సినిమాలో నటి దివ్య శ్రీపాద ఒక ప్రముఖ పాత్రలో నటించారు. RT టీమ్‌వర్క్స్ మరియు గోల్‌డెన్ మీడియా పతాకంపై రవితేజ మరియు సుధీర్ కుమార్ కుర్ర ఈ సినిమాని నిర్మించారు. ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com