ట్రెండింగ్
Epaper    English    தமிழ்

2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న 'అశోక వనంలో అర్జున కళ్యాణం'

cinema |  Suryaa Desk  | Published : Mon, May 06, 2024, 04:21 PM



విద్యాసాగర్ చింతా దర్శకత్వంలో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ నటించింన "అశోక వనంలో అర్జున కళ్యాణం" మే 6, 2022న థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది.


తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా విడుదలయ్యి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు.


విశ్వక్ సేన్ సరసన ఈ సినిమాలో రుక్సార్ ధిల్లాన్ జంటగా నటించింది. ఈ రొమాంటిక్ కామెడీ సినిమాలో కాదంబరి కిరణ్, గోపరాజు రమణ, కేదార్ శంకర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి జై క్రిష్ సంగీతం అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com