ట్రెండింగ్
Epaper    English    தமிழ்

125 మిలియన్ల స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'ప్రేమలు'

cinema |  Suryaa Desk  | Published : Mon, May 06, 2024, 05:20 PM



గిరీష్ ఎడి దర్శకత్వం వహించిన రొమాంటిక్ కామెడీ సినిమా ప్రేమలు ఈ సంవత్సరం మాలీవుడ్‌లో విడుదలైన బ్లాక్‌బస్టర్‌లలో ఒకటిగా నిలిచింది. ఈ సినిమా యొక్క తెలుగు వెర్షన్ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని ఆహా సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమా స్ట్రీమింగ్ కి అందుబాటులోకి ఉంది.


లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ హిట్ సినిమా ఇప్పటివరకు 125 మిలియన్ల స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసినట్లు సమాచారం. ఇదే విషయాన్ని మూవీ మేకర్స్ తమ సోషల్ ప్రొఫైల్స్‌లో అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాలో నస్లెన్ కె గఫూర్ మరియు మమితా బైజు ప్రధాన జంటగా నటించారు.


ఈ సినిమాలో  శ్యామ్ మోహన్ ఎమ్, మీనాక్షి రవీంద్రన్, అఖిలా భార్గవన్, అల్తాఫ్ సలీం, మాథ్యూ థామస్ మరియు సంగీత్ ప్రతాప్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. విష్ణు విజయ్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com