ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'థగ్ లైఫ్‌' అప్డేట్ విడుదలకి తేదీ లాక్

cinema |  Suryaa Desk  | Published : Mon, May 06, 2024, 08:29 PM



ఉలగనాయగన్ కమల్ హాసన్ మరియు స్టార్ దర్శకుడు మణిరత్నం దాదాపు 17 సంవత్సరాల తర్వాత కలిసి ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 'థగ్ లైఫ్' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమాకి సంబందించిన కీలక అప్డేట్ ని మే 8, 2024న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది.


ఈ సినిమాలో త్రిష కృష్ణన్, దుల్కర్ సల్మాన్, గౌతమ్ కార్తీక్ మరియు జయం రవి కీలక పాత్రలో నటిస్తున్నారు. రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ మరియు మద్రాస్ టాకీస్ బ్యానర్లపై కమల్ హాసన్, మణిరత్నం, ఆర్. మహేంద్రన్, మరియు శివ అనంతి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రతిభావంతులైన ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com