కామెడీ కింగ్ కపిల్ శర్మ మరోమారు సరైన ట్రాక్‌లో పడినట్టే కనిపిస్తోంది. గతంలో నాకూ మళ్లీ మంచి రోజులు వస్తాయంటూ చెప్పిన ఆయన ఇటీవలే తనప్రియురాలిని వివాహమాడి జీవితంలో ఆనందపు క్షణాలను గడుపుతున్నట్లు ఆ మధ్య ట్విట్టర్లో సంబంధిత ఫోటోలు కూడా షేర్ చేసుకున్నాడు. తన కామెడీతో ప్రేక్షకులని కడుపుబ్బ నవ్విస్తూ దేశ వ్యాప్తంగానే కాక ప్రపంచ వ్యాప్తంగా అభిమానులని పొందిన కపిల్ ‘వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్’ లో చోటు దక్కించుకుని ఔరా అనిపించాడు ఆయన సాధించిన ఈ ఘనతని కపిల్ శర్మ భార్య గిన్నీ తన సోషల్ మీడియా పేజ్ ద్వారా వెల్లడించింది. కపిల్ ప్రస్తుతం ‘ది కపిల్ శర్మ షో’ పేరుతో ప్రసారమవుతున్న కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహిరించడంతో పాటు నిర్మాతగాను పలు సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. అరుదైన గౌరవాన్ని అందుకున్న కపిల్శర్మను బాలీవుడ్ ప్రముఖులతో పాటు స్నేహితులు, శ్రేయాభిలాషులు శుభాకాంక్షలు తెలియజేస్తుండటంతో నా ఆనందానికి అంతే లేకుండా పోయిందని చెప్పిన ఆయన అభిమానుల ఆకాంక్షల మేరకు మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తానని చెప్పాడు