అజయ్ దేవగన్ 600 కోట్లతో మల్టీప్లెక్స్ థియేటర్లను నిర్మించనున్నాడా ?

  Written by : Suryaa Desk Updated: Sat, May 18, 2019, 06:48 PM

కాలక్రమేనా సినిమా ప్రేక్షకుల అభిరుచి ఎప్పటికప్పుడు మారుతూ వస్తుంది. ఈ మధ్య ప్రేక్షకులు సాధారణ థియేటర్స్ కంటే మల్లీప్లెక్స్ థియేటర్స్ వైపే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. దానికి కారణం కూడా లేకపోలేదు. న్యూ టెక్నాలజీ, విజువల్ ఎఫెక్ట్స్ ..డిజిటిల్ తో కూడిన సౌండ్ సిస్టం ..ఇలా ప్రేక్షకులను మైమరిచి పోయేలా చేస్తున్నాయి ఈ మల్లీప్లెక్స్ థియేటర్స్. అయితే ఈ మల్టీప్లెక్సుల బిజినెస్ ను బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ స్టార్ట్ చేస్తున్నారని వినికిడి. సుమారు 600కోట్ల పెట్టుబడితో నార్త్ ఇండియా మొత్తం మీద 250 తెరల్ని ఏర్పాటు చేయనున్నారని సమాచారం. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూద్దాం మరి..  
Recent Post