యాంకర్ హేమంత్ కి ఆక్సిడెంట్...

  Written by : Suryaa Desk Updated: Sun, May 19, 2019, 11:33 AM

ప్రముఖ నటుడు, యాంకర్, ఆర్జే హేమంత్ కారు ఈరోజు పల్టీకొట్టింది. ప్రమాద సమయంలో కారులోనే ఉన్న హేమంత్ సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది. విజయవాడలో ‘మహర్షి’ సక్సెస్ మీట్ కు హాజరైన హేమంత్ హైదరాబాద్ కు తిరిగి వెళుతున్నారు.

ఈ క్రమంలో ఆయన వాహనం జగ్గయ్యపేట మండలం మహమ్మద్ క్రాస్ రోడ్డు వద్దకు రాగానే ఎదురుగా ఓ గేదె ప్రత్యక్షమైంది. దాన్ని తప్పించబోయిన హేమంత్ కారుతో గేదెను ఢీకొట్టాడు. దీంతో అదుపు తప్పిన వాహనం పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో హేమంత్ స్వల్ప గాయాలతో బయటపడ్డట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Recent Post