ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయాల్లోకి సినిమా వాళ్లు రాకపోవడమే మంచిది: జమున

  Written by : Suryaa Desk Updated: Sun, May 19, 2019, 12:06 PM

తెలుగు తెరపై అలనాటి అందాల కథానాయికగా జమున ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. అలాగే చాలాకాలం క్రితమే ఆమె రాజకీయాల్లోను ప్రవేశించి పార్లమెంటులో అడుగుపెట్టారు. తాజా ఇంటర్వ్యూలో ఆమె నేటి రాజకీయాలను గురించి ప్రస్తావిస్తూ .."ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయాల్లోకి సినిమా వాళ్లు రాకపోవడమే మంచిది" అన్నారు.

"చిరంజీవిగారికి కూడా నేను ఇదేమాట చెప్పాను. మా అమ్మాయి పెళ్లికి శుభలేఖ ఇవ్వడానికి వెళ్లినప్పుడు, 'చిరంజీవిగారూ .. మీరు గొప్ప ఆర్టిస్ట్ .. మిమ్మల్ని ఎంతగానో అభిమానించేవాళ్లున్నారు. దయచేసి ఈ కుళ్లు రాజకీయాల్లోకి మాత్రం రావొద్దు' అని చెప్పాను. అప్పుడు అయన నవ్వేసి ఊరుకున్నారు .. కానీ వచ్చాక ఏం జరిగింది? మేమేదో వచ్చేస్తాం .. ఈ కుళ్లును కడిగేస్తాం అంటే ..  అది చాలా కష్టమైన విషయం .. జరిగేపని కూడా కాదు" అంటూ చెప్పుకొచ్చారు.
Recent Post