నేను ఎవరితో ప్రేమలో పడ్డాననే విషయం తెలుసుకోవాలి: ఐశ్వర్య

  Written by : Suryaa Desk Updated: Sun, May 19, 2019, 05:01 PM

తమిళంలో వరుస చిత్రాలు చేస్తూ దూసుకుపోతున్న హీరోయిన్లలో ఐశ్వర్యా రాజేశ్ ఒకరు. ఈమె త్వరలోనే తెలుగు వెండితెరపై కూడా కనిపించనుంది. యవ దర్శకుడు క్రాంతి మాధవ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా ఐశ్వర్యా రాజేశ్ నటించనుంది.


అయితే, విజయ్ దేవరకొండతో ఐశ్వర్యా రాజేశ్ ప్రేమలో పడినట్టు వార్తలు సోషల్ మీడియాలో షేక్ చేస్తున్నాయి. వీటిపై ఈ హీరోయిన్ స్పందించింది. "నాకు ఒక ప్రేమకథ ఉందని, నేను ప్రేమలో ఉన్నాననే వార్తలను గత కొన్ని రోజులుగా వింటున్నాను. నేను ఎవరితో ప్రేమలో పడ్డాననే విషయం తెలుసుకోవాలని ఉందంటూ ట్వీట్ చేసింది. నేను నిజంగానే ఎవరి నైనా ప్రేమిస్తే ముందుగా మీకే చెపుతానని, అనవసరంగా పుకార్లను చేయకండని" ఆమె కోరారు.
Recent Post