ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'కిల్లర్' ట్రైలర్ రేపు విడుదల

cinema |  Suryaa Desk  | Published : Sun, May 19, 2019, 08:22 PM



క్రేజీ హీరో విజయ్ ఆంటోని, యాక్షన్ కింగ్ అర్జున్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో ఆండ్రూ లూయిస్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కొలైగారన్‌’. దియా మూవీస్‌ బ్యానర్ తమిళంలో నిర్మించిన ఈ సినిమాని పారిజాత మూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై టి.నరేష్‌కుమార్‌–టి.శ్రీధర్‌ ‘కిల్లర్‌’ పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. మర్డర్‌ మిస్టరీ, క్రైౖమ్‌ థ్రిల్లర్‌ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమా లో అషిమా కథానాయికగా నటించారు.ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. జూన్ తొలి వారంలో సినిమా రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా ఈ చిత్రం ట్రైలర్ ని రేపు రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర నిర్మాతలు ప్రకటించారు..ఇప్పటికే ఈ సినిమా టీజ‌ర్, పాటలు రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ తెచ్చుకోగా సినిమా పై అంచనాలను పెంచింది.. టీజర్ ని బట్టి విజ‌య్ ఆంటోని.. యాక్ష‌న్ కింగ్ అర్జున్ పోటాపోటీగా న‌టించే చిత్ర‌ం అని తెలుస్తోంది. సైమ‌న్.కె.కింగ్ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమా కి మాక్స్ సినిమాటోగ్రఫీ ని అందిస్తున్నారు..






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com