తొలి త్రీడీ హర్రర్ చిత్రం ’లిసా‘ ప్రీ రిలీజ్

  Written by : Suryaa Desk Updated: Sun, May 19, 2019, 10:06 PM

 అంజలి టైటిల్ రోల్‌ పోషిస్తున్న చిత్రం ‘లిసా’  ప్రీ రిలీజ్ వేడుక ఆదివారం జరిగింది. అతిథిగా విచ్చేసిన ’మా‘ మాజీ అధ్యక్షుడు శివాజీరాజా ట్రైలర్‌ని విడుదల చేశారు. రాజు విశ్వనాథ్ దర్శకత్వంలో వీరేశ్ కాసాని సమర్పణలో ఈ చిత్రాన్ని ఎస్.కె.పిక్చర్స్ పతాకంపై సురేష్ కొండేటి విడుదల చేస్తున్నారు అనంతరం హీరోయిన్ అంజలితో కలిసి చిత్ర ఆడియో బిగ్ సీడీ ని రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా అంజలి మాట్లాడుతూ.. ’ఇది నా కెరీర్‌లో ప్రత్యేకమైన, ముఖ్యమైన సినిమా ఇది. మొదటిసారి 3డీలో హర్రర్ సినిమా చేస్తున్నా. ఇదొక భిన్నమైన అనుభూతినిచ్చింది. ఇందులో ఉన్న పాట నా కెరీర్ బెస్ట్ సాంగ్. సాంకేతికంగానూ ది బెస్ట్‌గా ఉంటుంది. ఆడియెన్స్‌కి ఖచ్చితంగా నచ్చే చిత్రమవుతుంది. సురేష్ కొండేటి నా సినిమాలని తెలుగులో విడుదల చేసి సూపర్ హిట్స్ అందుకున్నారు. ఈ సినిమా కూడా వాటి తరహాలోనే ఘనవిజయం సాధించాలి‘ అని అన్నారు.
Recent Post