అమీ జాక్సన్‌ రూటే సెపరేట్..

  Written by : Suryaa Desk Updated: Mon, May 20, 2019, 11:32 AM

సాధారణంగా హీరోయిన్స్ ప్రెగ్నెంట్ అయితే.. మీడియాకు దూరంగా ఉంటారు. అప్పుడప్పుడు మీడియాకి అలా కనిపించి వెళ్తూంటారు. కానీ అమీ జాక్సన్‌ మాత్రం రూటే సెపరేట్ అంటోంది. ప్రెగ్నెంట్ అయిన తరువాత కూడా ఫోటో షూట్‌లు చేస్తూ దూసుకుపోతోంది. ఈ సందర్భంగా అమీ ఒక ఫోటో షూట్ చేసింది. వైట్ కలర్ డ్రెస్‌లో ఆమె ఫొటోలకు ఫోజులిచ్చింది. ఈ ఫొటోను ఆమె ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటో వైరల్ అవుతోంది. ఈ ఫొటోను చూసిన నెటిజన్లు అమీ నువ్వు సూపర్ అంటూ రిప్లైలు ఇస్తున్నారు.


గెస్ అనే బ్రాండ్‌కు ఈ అమ్మడు బ్రాండ్ అంబాసిడర్. గర్భం ధరించినా మోడలింగ్‌కు అవేమీ షరతులు కావని చెప్తోంది. రీసెంట్‌గా గెస్ లాస్ ఏంజిల్స్ 1981 పేరుతో ఉత్పత్తులను ప్రారంభించింది.
Recent Post