ఆ సినిమాలో చేసినందుకు ఇప్పటికీ బాధపడుతుంటాను: ఐశ్వర్య రాజేశ్

  Written by : Suryaa Desk Updated: Mon, May 20, 2019, 11:32 AM

తమిళంలో వరుస అవకాశాలతో ఐశ్వర్య రాజేశ్ దూసుకుపోతోంది. ఈ ఐశ్వర్య రాజేశ్ ఎవరో కాదు .. ఒకప్పుడు తెలుగులో 'మల్లెమొగ్గలు'తో హీరోగా పరిచయమైన రాజేశ్ కూతురు. క్రాంతిమాధవ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ చేయనున్న సినిమా ద్వారా తెలుగు తెరకి కథానాయికగా పరిచయం కానుంది. ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లే దిశగా సన్నాహాలు జరుగుతున్నాయి.

తాజా ఇంటర్వ్యూలో ఐశ్వర్య రాజేశ్ మాట్లాడుతూ, ఇంతకుముందు అంతగా ప్రాధాన్యత లేని పాత్రలను కొన్ని మొహమాటాల కారణంగా చేయవలసి వచ్చింది. అలాంటి పాత్రల వలన నాకు ఎంతమాత్రం గుర్తింపు రాలేదు. ఆ తరహా పాత్రల్లో ఒకటి 'సామీ స్క్వేర్' లో చేశాను. ఆ సినిమాలో రెండో కథానాయికగా ఎంత మాత్రం  ప్రాధాన్యత లేని పాత్ర చేసినందుకు ఇప్పటికీ బాధపడుతుంటాను. ఇకపై ఎలాంటి మొహమాటాలకు వెళ్లదలచుకోలేదు .. అలాంటి పాత్రలను చేయదలచుకోలేదు" అని చెప్పుకొచ్చింది. 
Recent Post