ఎన్టీఆర్ బర్త్ డే స్పెషల్.. ఆయన నట ప్రయాణం

  Written by : Suryaa Desk Updated: Mon, May 20, 2019, 12:09 PM

తెలుగు సినీ చరిత్రలో ఎప్పటికి చెరగని పేరు నందమూరి తారక రామారావు గారు. అయన మనువడిగా అయన పేరునే కాక నట వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. బహుముఖ ప్రజ్ఞాశాలి గా ఇప్పటితరంలో పేరు తెచ్చుకున్నాడు తారక్. ఈ రోజు అయన పుట్టిన రోజు. మే 20 1983 జన్మించిన ఆయన ఈ రోజు 36 వ వసంతం లోకి అడుగుపెట్టారు. ఎన్టీఆర్ కి తెలుగు చిత్రసీమలో అల్ రౌండర్ అనే ముద్ర పడింది. డాన్స్ లో కానీ డైలాగ్ డెలివరీలో గాని నటనలో కానీ చివరకు గాయకుడిగా తన విశ్వరూపాన్ని చూపిస్తున్నాడు.

మామూలుగా చిన్నప్పటి నుండి కూచిపూడి డాన్సర్ అయిన ఎన్టీఆర్ 1996 గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన “బాలరామాయణం” మూవీతో బాల నటుడిగా తెరంగేట్రం చేశారు . 2000 సంవత్సరం లో ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్ పై మొదటిసారి హీరోగా “నిన్ను చూడాలని” మూవీతో తన ప్రస్థానం మొదలుపెట్టారు. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ చేసిన ‘స్టూడెంట్ నం .1″ మూవీతో మొదటి విజయం అందుకున్న ఎన్టీఆర్, 19 ఏళ్ల వయసుకే ‘ఆది’, ‘సింహాద్రి’, వంటి ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చి టాలీవుడ్లో తిరుగులేని స్టార్ గా ఎదిగారు. తక్కువ వయసులోనే వచ్చిపడిన అంత పెద్ద స్టార్ డమ్ ని తనకు అనుకూలంగా మలుచుకోవడంలో ఎన్టీఆర్ విఫలం అయ్యారు. సినిమాల ఎంపిక విషయంతో ఎన్టీఆర్ సరైన నిర్ణయాలు తీసుకోకపోవడంతో ఆయనకు ఒక దశలో వరుస పరాజయాలు ఎదురైనాయి. తనకు ‘సింహాద్రి’ వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన రాజమౌళి తో చేసిన “యమదొంగ ” మూవీతో ఆయన మళ్ళీ విజయాల బాట పట్టారు. మళ్ళీ ఆ సినిమా తర్వాత కొన్ని పరాజయాలు ఎదురయ్యాయి.

ఇక  పూరి జగన్నాధ్ 'టెంపర్' సినిమాతో సక్సెస్ అందుకున్న తరువాత ఇక వెనుకకి చూసుకోనేలేదు ఎన్టీఆర్. ఈ సినిమాలో పూర్తిగా తన లుక్ మార్చి అందరితోను ఔరా అనిపించుకున్నాడు. ఈ సినిమా తరువాత వరుసగా ఆయనను విజయాలు పలకరించాయి. ఆ తరువాత 'నాన్నకు ప్రేమతో', 'జై లవ కుశ' , 'అరవింద సమేత' లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ సొంతం చేసుకున్నాడు. నటుడుగానే కాక తెలుగులో వచ్చిన బిగ్ బాస్ సీజన్ 1 కి వ్యాఖ్యాతగా అక్కడ కూడా సక్సెస్ అందుకున్నారు. ఇలా ఎన్టీఆర్ తన మల్టీ టాలెంట్స్ తో తన అభిమానుల్ని అలరిస్తూ తన జర్నీ సాగిస్తున్నారు. ఇక ఆయన నుండి వస్తున్న తాజా చిత్రం 'ఆర్ ఆర్ ఆర్'. బాహుబలి తర్వాత రాజమౌళి ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తెరెకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, అలియా భట్ , నిత్యా మీనన్ లు తదితరులు నటిస్తున్నారు. చూద్దాం మరి ఈ సినిమా ఎన్ని రికార్డులు తిరగరాస్తుందో.......   
Recent Post