ఫ్రెండ్ షిప్ చూసి అపార్థం చేసుకోవద్దు: అంజలి

  Written by : Suryaa Desk Updated: Mon, May 20, 2019, 12:32 PM

తమిళ ప్రేక్షకులకి ముందుగా పరిచయమైనప్పటికీ, తెలుగులోను అంజలికి మంచి క్రేజ్ వుంది. ఆమె తాజా చిత్రంగా రూపొందిన 'లిసా' ఈ నెల 24వ తేదీన విడుదల కానుంది. ఈ సందర్భంగా అంజలి మాట్లాడుతూ, "ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకుల ఆదరణ పొందుతుందనే నమ్మకం నాకు వుంది. హారర్ థ్రిల్లర్ సినిమాలను నేను ఎక్కువగా ఇష్టపడుతూ వుంటాను. అందువల్లనే ఆ తరహా సినిమాల్లో నా నటన మరింత బాగుంటుంది.

ఈ కారణంగానే ఈ కాన్సెప్ట్ తో కూడిన కథలు నా దగ్గరికి వస్తున్నాయి. నాకు అఫైర్ ఉందనీ .. బ్రేకప్ జరిగిందనే వార్తలు చాలా రోజులుగా షికారు చేస్తున్నాయి. నాకు ఎవరితోను అఫైర్ లేదు కనుక, బ్రేకప్ జరిగే ఛాన్స్ లేదు. స్నేహాన్ని చూసి అపార్థం చేసుకోవద్దు. అలాగే ఇప్పట్లో పెళ్లి ఆలోచన కూడా లేదు. ఎందుకంటే నా దృష్టి అంతా కూడా సినిమాలపైనే వుంది. నా తదుపరి సినిమా అయిన 'సైలెన్స్' కోసం అమెరికా వెళుతున్నాను" అని చెప్పుకొచ్చింది.
Recent Post