ప్రభాస్ అభిమానులకి శుభ వార్త

  Written by : Suryaa Desk Updated: Mon, May 20, 2019, 02:28 PM

బాహుబలి 2 తర్వాత ప్రభాస్ చేస్తున్న చిత్రం 'సాహో'. ఈ సినిమాకు సుజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ జోడీగా శ్రద్ధాకపూర్ నటిస్తుంది. ఈ సినిమా నుంచి ఈ మధ్య ఎలాంటి అప్ డేట్స్ లేకపోవడంతో, ప్రభాస్ అభిమానులు చాలా అసంతృప్తితో వున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ప్రభాస్ ఒక వీడియో బైట్ ను రిలీజ్ చేశాడు. రేపు ఒక సర్ ప్రైజింగ్ న్యూస్ ఉంటుందని చెప్పాడు.'సాహో' నుంచి ఒక పోస్టర్ ను రిలీజ్ చేసే అవకాశం ఉందనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. ఇటీవల హైదరాబాద్ - పార్క్ హయత్ హోటల్లో ప్రభాస్ పై ప్రత్యేకంగా ఫొటో షూట్ ను నిర్వహించారు. ఆ ఫొటోలను ప్రచారానికి ఉపయోగించనున్నట్టు తెలుస్తోంది. 250 కోట్లకి పైగా బడ్జెట్ తో రూపొందుతోన్న ఈ సినిమాను, ఆగస్టు 15వ తేదీన విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు.
Recent Post