జగ్గు భాయ్ ఎక్కడ కనిపించడం లేదు!

  Written by : Suryaa Desk Updated: Mon, May 20, 2019, 03:09 PM

వీలైనంత వినోదం .. అవసరమైనంత సందేశాన్ని మేళవించి వంశీ పైడిపల్లి 'మహర్షి' సినిమాను రూపొందించాడు. భారీ బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమా, భారీ వసూళ్లను రాబడుతూ దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా విజయోత్సవాన్ని కూడా నిర్వహించారు. ఈ సినిమాలో ప్రతినాయకుడిగా జగపతిబాబు నటించారు. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో ఎక్కడా జగపతిబాబు పాల్గొనలేదు.

ఇక ఈ సినిమా విజయోత్సవ కార్యక్రమంలోను జగపతిబాబు కనిపించలేదు. దాంతో ఎక్కడో తేడా కొట్టేసిందనే ప్రచారం ఫిల్మ్ నగర్లో జరుగుతోంది. వరుస సినిమాలతో జగపతిబాబు బిజీగా ఉన్నాడనీ, అందువల్లనే ఆయన రాలేదని కొందరు అంటున్నారు. ఎంత తీరిక లేకుండా వున్నా ఒక్క ప్రమోషన్లోనూ పాల్గొనకుండా ఉంటాడా? అని మరొకొందరు సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. 'మహర్షి' సంబరాల్లో జగపతిబాబు సందడి లేదనే టాక్ పై ఆయన ఎలా స్పందిస్తాడో చూడాలి మరి.
Recent Post