ఆ హీరోలని విడిచిపెట్టి నా దగ్గరికి ఎందుకు వస్తారు : అల్లు శిరీష్

  Written by : Suryaa Desk Updated: Mon, May 20, 2019, 03:56 PM

అల్లు శిరీశ్ తాజా చిత్రంగా వచ్చిన 'ఏబీసీడీ' ప్రస్తుతం థియేటర్స్ లో వుంది. ఈ సినిమాపై టాక్ ఎలా ఉందనే విషయం అటుంచితే, నటన పరంగా అల్లు శిరీశ్ మరింత పరిణతి కనబరిచాడని అంటున్నారు. తాజా ఇంటర్వ్యూలో అల్లు శిరీశ్ మాట్లాడుతూ .. 'ఏబీసీడీ'కి వస్తోన్న రెస్పాన్స్ ఆనందాన్నిస్తోంది. ఇకపై కూడా ఫన్ తో కూడిన ప్రేమకథా చిత్రాలనే చేయాలనుకుంటున్నాను.

యాక్షన్ సినిమాలు చేయమని కొంతమంది అంటున్నారు. ఆ తరహా సినిమాలు చేయడానికి ఇంకా సమయం వుందనేది నా ఉద్దేశం. ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాల తరువాత యాక్షన్ కథలను టచ్ చేస్తాను. ఇక పెద్ద దర్శకుల సినిమాల్లో చేయాలని వుంది. నిజం చెప్పాలంటే ఇంతవరకూ ఒక్క పెద్ద దర్శకుడు కూడా నన్ను సంప్రదించలేదు .. కథ చెప్పలేదు. వాళ్ల హీరోలు వాళ్లకి వున్నారు. వందల కోట్ల మార్కెట్ వున్న హీరోలను వదులుకుని వాళ్లు నా దగ్గరికి ఎందుకు వస్తారు చెప్పండి?' అంటూ నవ్వేశాడు. 
Recent Post