మూడు భాషా చిత్రాల్లో ‘రెజీనా’ బిజీ

  Written by : Suryaa Desk Updated: Mon, May 20, 2019, 04:37 PM

‘ఏక్‌ లడకీకో ఐసాలగా’ అనే చిత్రంతో న‌టి రెజీనా బాలీవుడ్‌ జనాలను పలకరించింది. అయితే ఈ సినిమా ఆశించిన విజయం సాధించ లేదు. అయినప్పటికీ అక్కడే మకాం వేసి.. మరిన్ని అవకాశాలను సొంతం చేసుకుంటోంది. ప్రస్తుతం ‘18’ అనే చిత్రంలో నటిస్తోంది. దీంతోపాటు మరో రెండు సినిమాల్లో నటించే అవకాశాన్ని దక్కించుకున్నట్లు ఆమె సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఆమె మరింత ఉత్సాహంగా ఉంది. ప్రస్తుతం తమిళంలో వెంకట్‌ ప్రభు దర్శకత్వంలోని ‘పార్టీ’, ‘కల్లపార్ట్‌’, ‘7’ తదితర చిత్రాల్లో నటిస్తోంది. తెలుగులో కూడా ఒకట్రెండు చిత్రాల్లో నటిస్తున్నట్లు సమాచారం. 
Recent Post