కార్తీతో ‘నికిలావిమ‌ల్‌’

  Written by : Suryaa Desk Updated: Mon, May 20, 2019, 04:40 PM

డైరెక్ట‌ర్ జీతు జోసెఫ్‌ తెరకెక్కిస్తున్న చిత్రంలో న‌టులు కార్తి, జ్యోతికలు అక్క, తమ్ముళ్లుగా నటిస్తున్నారు. కనిపించకుండా పోయిన తమ్ముడి కోసం వెతుకులాటే ఈ సినిమా ప్రధాన కథాంశం. ఈ చిత్రంలో సత్యరాజ్, ‘రాక్షసన్‌’ ఫేమ్‌ అమ్ము అభిరామి తదితరులు నటిస్తున్నారు. గోవింద్‌ వసంత సంగీతాన్ని అందిస్తున్నారు. రాజశేఖర్‌ సినిమాటో గ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమాకు ఇంకా పేరు ఖరారు చేయలేదు. ఈ చిత్ర చిత్రీకరణ ఊటీలో శరవేగంగా జరుగుతోంది. కార్తీకి జోడీగా నికిలా విమ‌ల్‌ను ఎంచుకున్నట్లు సమాచారం. తాజాగా జరిగిన చిత్రీకరణలో ఆమె కూడా పాల్గొని నటించింది. ఈ ఫొటోలను నటుడు కార్తి ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ఇందులో సినిమాటోగ్రాఫర్‌ ఆర్‌టీ రాజశేఖర్, నికిలా విమల్, కార్తి, దర్శకుడు జీతు జోసెఫ్‌లు ఉన్నారు.
Recent Post