అందుకే ఆ సినిమా రాక్ స్టార్ చేయలేదా ?

  Written by : Suryaa Desk Updated: Mon, May 20, 2019, 04:44 PM

హరీశ్ శంకర్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ కథానాయకుడిగా 'వాల్మీకి' చిత్రం రూపొందుతోంది. కొంతకాలం క్రితం తమిళంలో విజయవంతమైన 'జిగర్తాండ'కి ఇది రీమేక్. ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా దేవీశ్రీని ఎంపిక చేసుకున్నట్టుగా వార్తలు వచ్చాయి. కొన్ని రోజుల క్రితం ఈ ప్రాజెక్టు నుంచి దేవిశ్రీ తప్పుకున్నాడనే టాక్ వచ్చింది. దాంతో కారణమేమిటో తెలియక అంతా ఆశ్చర్యానికి లోనయ్యారు.

ఈ ప్రాజెక్టు నుంచి దేవిశ్రీ తప్పుకోవడానికి కారణం ఒక రీమిక్స్ సాంగ్ అనేది తాజా సమాచారం. ఈ సినిమా కోసం హరీశ్ శంకర్ ఒక రీమిక్స్ సాంగ్ ను ప్లాన్ చేసుకున్నాడట. ఈ సాంగ్ మాస్ ఆడియన్స్ ను ఒక ఊపు ఊపేస్తుందని ఆయన భావించాడు. అయితే రీమిక్స్ సాంగ్స్ తాను చేయననీ .. ఇది తన నియమాల్లో ఒకటని దేవిశ్రీ తేల్చిచెప్పాడట. అయితే ఈ విషయంలో ఆయనను ఒప్పించడానికి హరీశ్ శంకర్ కాస్త గట్టిగానే ప్రయత్నించాడనీ, దాంతో దేవిశ్రీ తన వల్ల కాదంటూ తప్పుకున్నాడని చెప్పుకుంటున్నారు.
Recent Post