జ‌య జీవిత య‌దార్ధ‌ఘ‌ట‌న‌లే శశి లలిత - నిర్మాత, ద‌ర్శ‌కుడు కేతిరెడ్డి

  Written by : Suryaa Desk Updated: Mon, May 20, 2019, 05:37 PM

జయ లలిత సినిమా ద్వారా ఆమెకు జరిగిన అన్యాయం చూపించ బోతున్నామ‌ని చెప్పారు ద‌ర్శ‌కుడు కేతిరెడ్డి జ‌గ‌దీశ్వ‌ర‌రెడ్డి,  సోమ‌వారం ఆయ‌న చెన్నైలోని త‌న కార్యాల‌యంలో చిత్ర పోస్ట‌ర్‌ని విడుద‌ల చేసిన అనంత‌రం మాట్లాడుతూ త‌మ  సినిమా లో జ‌య‌ల‌లిత‌, శ‌శిక‌ళ జీవితాల యదార్థ సంఘటనలు తెరకెక్కించనున్నామ‌ని తెలిపారు. జయ లలిత బాల్యం.. నుంచి చిత్ర పరిశ్రమ కు రావడం.. శోభన్ బాబు తో ప్రేమ వ్యవహారం.. ఇలా అన్ని అంశాలు కవర్ చేసాం.. జ‌య‌మ‌ర‌ణానికి ముందు 78 రోజుల పాటు హాస్పిటల్ లో జరిగినదేంటి..!  ప్ర‌జ‌ల‌కు చెప్పాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. రెండన్నర గంటల్లో జయలలిత జీవితంలో జరిగిన ముఖ్య సంఘటనలు అన్ని సినిమాలో ఉంటాయ‌ని, వచ్చే ఏడాదిలో శశి లలిత రీలీజ్ చేయబోతున్నామ‌న్నారు.  జయ లలిత పాత్రలో కాజల్ దేవగన్, శశి కల పాత్ర అమల పాల్ నటించబోతున్నారని చెప్పారు. 


 ఎలెక్షన్ కోడ్ వలన లక్ష్మీస్ వీరగ్రంధం..లేట్ అయ్యింద‌ని, ఇప్ప‌టికే ఈ సినిమా చిత్ర నిర్మాణం పూర్త‌య్యింద‌ని, కోడ్ తొలగిన వెంటనే సినిమా రిలీజ్ చేయ‌బోతున్నాం  జూన్ చివ‌రిలో ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంద‌ని తెలిపారు. 
Recent Post