పుస్తకాల వల్లనే విజయ్ దేవరకొండ ఈ స్థాయికి వచ్చాడట...

  Written by : Suryaa Desk Updated: Mon, May 20, 2019, 06:01 PM

ఈ మధ్య చాల తక్కువ టైంలో ఎక్కువ పాపులర్ అయిన నటుల్లో విజయ్ దేవరకొండ ఒకడు. ఈ రౌడీ విజయ్ అంటే యూత్ లో విపరితమైన క్రేజ్ ఉంది. అయితే తాజాగా యువ రచయిత వెంకట్ శిద్ధారెడ్డి రచించిన “సోల్ సర్కస్”, సినిమా కథలు పుస్తకాల్ని శనివారం హైదరాబాద్‌లో విజయ్‌దేవరకొండ, నిర్మాత సురేష్‌బాబు విడుదలచేశారు. ఈ సంధర్బంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ “పుస్తకాలు చదవడం చాలా మంచి లక్షణం. నా జీవితంలో బుక్స్ కీలకమైన పాత్రను పోషించాయి. నా ఉన్నతికి కారణమయ్యాయి. నా ఆలోచన విధానాన్ని మార్చివేశాయి” అని అన్నారు.ఈ సందర్భంగా యంగ్ డైరెక్టర్ తరుణ్‌భాస్కర్ మాట్లాడుతూ “తెలుగులో కథలు కొరత చాలా ఉంది. తమిళ సాహిత్యం నవతరం ఫిలిమేకర్స్‌లో స్ఫూర్తిని నింపుతోంది. వాటి ద్వారా అద్భుతమైన సినిమాలు రూపొందుతున్నాయి. తెలుగులో అలాంటి ప్రయత్నాలు జరగాలి” అని చెప్పారు.

వెంకట్ శిద్ధారెడ్డి మాట్లాడుతూ “2015లో ‘సోల్‌సర్కస్’ పేరుతో తొలి కథ రాశాను. అప్పటి నుంచి సాహిత్యాన్ని సీరియస్‌గా తీసుకోవడం మొదలుపెట్టాను. త్వరలో అన్విక్షి పబ్లిషర్స్ ద్వారా పెద్దింటి అశోక్‌కుమార్, కాశీభట్ల వేణుగోపాల్ పుస్తకాలనుముద్రించటంతో పాటు కృష్ణశాస్త్రి, దేవులపల్లి ఆంగ్ల పుస్తకాల్ని తెలుగులో అనువదిస్తున్నాం అని తెలిపారు. ఈ కార్యక్రమంలోప్రముఖ కమెడియన్ ప్రియదర్శి తదితరులు పాల్గొన్నారు.
Recent Post