మీరు చూపిస్తున్న ప్రేమాభిమానాలకు ముగ్ధుడ్నయ్యా : ఎన్టీఆర్

  Written by : Suryaa Desk Updated: Mon, May 20, 2019, 06:21 PM

తెలుగు సినిమా టాప్ హీరోల్లో ఒకరైన జూనియర్ ఎన్టీఆర్ ఇవాళ 36 పుట్టిన రోజు జరుపుకున్నారు. తమ అభిమాన హీరో పుట్టినరోజు సందర్భంగా అభిమానులు గత కొన్నిరోజుల నుంచే సామాజిక మాధ్యమాల్లో శుభాకాంక్షలతో హోరెత్తిస్తున్నారు.1983 మే 20న తారక్ జన్మించాడు. తారక్ సన్నిహితులు, సినీ ప్రముఖులు కూడా బర్త్ డే విషెస్ చెప్పారు. ఈ ఉదయం నుంచే జూనియర్ కు ట్విట్టర్ లో పుట్టినరోజు శుభాకాంక్షల తాకిడి ఎక్కువైంది. దీనిపై ఆయన స్పందిస్తూ, అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ప్రతిఒక్కరూ తనపై చూపిస్తున్న ప్రేమాభిమానాలకు ముగ్ధుడ్నయ్యానంటూ ట్వీట్ చేశారు.
Recent Post