పుర్రెల‌పై చిరున‌వ్వులు చిందిస్తున్న న‌టులు

  Written by : Suryaa Desk Updated: Mon, May 20, 2019, 07:01 PM

బాలీవుడ్ న‌టుడు అక్షయ్ కుమార్.. కృతి సనన్.. రితీష్ దేశ్ ముఖ్.. బాబీ డియోల్..పూజా హెగ్డే.. రానా దగ్గుబాటి.. కృతి కర్బందా ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది. ఈ సినిమా గురించి తాజాగా అక్షయ్ కుమార్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఒక ఇంట్రెస్టింగ్ ఫోటో పోస్ట్ చేశాడు. ఈ ఫోటోకు “హౌస్ ఫుల్ ఆఫ్ త్రోన్స్.. ఎవరు బతుకుతారో ఎవరు చస్తారో స్క్రిప్ట్ మాత్రమే నిర్ణయిస్తుంది”అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. పూజా హెగ్డే కూడా ఈ ఫోటో పోస్ట్ చేసి “ఇది ఫైనల్ షెడ్యూల్.. ఏం జరుగుతుందో హౌస్ ఫుల్4 #రీ పోస్ట్” అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ ఫోటోలో వరసగా లెఫ్ట్ నుంచి రైట్ కు రితీష్ దేశ్ ముఖ్ .. కృతి సనన్.. అక్షయ్ కుమార్.. పూజా హెగ్డే.. బాబీ డియోల్.. కృతి కర్భందా ఉన్నారు. అందరూ భయంకరంగా ఉండే పుర్రెల గుట్టపై కూర్చొని చిరునవ్వులు చిందిస్తూ ఉన్నారు. కింద ఉన్న పుర్రెలకు తోడుగా రితీష్ దేశ్ కృతి సనన్ కు మధ్యలో మరో పుర్రె ఉంది. ఈ ఫోటోలో పూజా హెగ్డే షార్ట్ డ్రెస్ లో యమా హాట్ గా ఉంది. కృతి కర్భందా ఒక మెరూన్ కలర్ గౌన్ లో బ్యూటిఫుల్ గా ఉంది. ఈ సినిమాకు ఫర్హాద్ సంజీ దర్శకత్వం వహిస్తున్నాడు. నడయాడ్ వాలా గ్రాండ్ సన్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని సాజిద్ నడయడ్ వాలా నిర్మిస్తున్నాడు. ఈ చిత్రాన్ని దీపావళి పండగ సందర్భంగా ఈ ఏడాది అక్టోబర్ 25 న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
Recent Post