ఐశ్వర్యరాయ్ ఫోటో ని రాజకీయాలతో పోల్చి వివాదాల్లో పడ్డ వివేక్ ఒబెరాయ్

  Written by : Suryaa Desk Updated: Mon, May 20, 2019, 07:17 PM

'వినయ విధేయ రామ' సినిమాతో టాలీవుడ్ లో విలన్ గా ఎంట్రీ ఇచ్చిన 'వివేక్ ఒబెరాయ్' గుర్తున్నాడుగా. బాలీవుడ్ లో మోస్ట్ బిజీగా ఉన్న వివేక్ సినిమాల కంటే వివాదాలతోనే ఎక్కువ గడిపేస్తున్నాడు. అయన ఈ జనరల్ ఎలక్షన్స్ లో బీజేపీ పార్టీకి బహిరంగంగానే తన మద్దతు ఇచ్చి వార్తల్లో నిలిచాడు. అది కాక అయన నరేంద్ర మోడీ బయోపిక్ లో కూడా నటించాడు. ఎన్నిక‌ల ఫ‌లితాలు స‌మీపిస్తున్న వేళ ఈ న‌టుడు చేసిన ఓ ట్వీట్ సోష‌ల్ మీడియాలో క‌ల‌క‌లం సృష్టిస్తుంది. ఈరోజు ఎగ్జిట్ పోల్స్ భారతీయ జ‌న‌తా పార్టీ మ‌ళ్లీ అధికారంలో వ‌స్తుంద‌ని సూచించాయి. 


కాగా వివేక్ ఒబెరాయ్ ఒక‌ప్పుడు మాజీ ప్ర‌పంచ సుంద‌రి ఐశ్వ‌ర్యరాయ్ ప్రేమికుడ‌ని, అంత కంటే ముందు స‌ల్మాన్‌ఖాన్‌తో కూడా ఆమె ప్రేమ‌లో వ్య‌వ‌హారం న‌డిపింద‌ని ఒక‌ప్పుడు మీడియాలో జోరుగా వార్త‌లు వినిపించాయి. కానీ అమితాబ్ బ‌చ్చ‌న్ త‌న‌యుడు అభిషేక్ బ‌చ్చ‌న్‌ను ఐశ్వ‌ర్య వివాహం చేసుకుంది. ఇప్పుడు వారికి ఓ పాప కూడా ఉంది. ఈ వ్య‌వ‌హారానికి, ఎన్నిక‌ల‌కు లింక్ పెడుతూ ప‌వ‌న్ సింగ్ అనే వ్య‌క్తి స‌ల్మాన్‌, వివేక్‌, అభిషేక్‌తో ఉన్న ఫోటోను క్రియేట్ చేసి పోస్ట్ చేశాడు. దాన్ని వివేక్ ఒబెరాయ్ త‌న ట్విట్ట‌ర్ అకౌంట్ షేర్ చేస్తూ హ హ‌ హ‌.. అంటూ మెసేజ్ కూడా పోస్ట్ చేశాడు.

దీనిపై ఇప్పుడు ఐశ్వ‌ర్యరాయ్ వ్య‌క్తిగ‌తాన్ని ట‌చ్ చేయ‌డం ఎందుకు? అంటూ వివేక్ చేసిన ట్వీట్ నెట్టింట్లో క‌ల‌క‌లం క్రియేట్ చేస్తుంది. రాజ‌కీయంగా చాలా వ్య‌వ‌హారాలు జ‌ర‌గొచ్చు. కానీ ఎవ‌రో చేసిన ఫోటోను వివేక్ ఒబెరాయ్ పోస్ట్ చేయ‌డ‌మేంటి? ఇలా చేయ‌డం ద్వారా ఆయ‌నేం చెప్పాల‌నుకున్నారు? అంటూ నేష‌న‌ల్ మీడియాలో కూడా ఇదొక పెద్ద వార్తైంది. మరి  ఈ వ్యవహారంపై  ఇటు వివేక్.. అటు  అమితాబ్ ఫ్యామిలీ అండ్ ఐశ్వర్యారాయ్ ఎలా స్పందిస్తారో చూడాలి. 
Recent Post