'కిల్లర్' ట్రైలర్ విడుదల..!!

  Written by : Suryaa Desk Updated: Tue, May 21, 2019, 01:56 AM

విజయ్ ఆంటోనీ, యాక్షన్ కింగ్ అర్జున్ ప్రధాన పాత్రల్లో న‌టించిన తాజా తమిళ చిత్రం ‘కొలైగార‌న్’. ఆండ్రూ లూయిస్ దర్శకుడు. అషిమా క‌థానాయిక‌. దియా మూవీస్‌ బ్యానర్ తమిళంలో నిర్మించిన ఈ సినిమాని పారిజాత మూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై టి.నరేష్‌కుమార్‌–టి.శ్రీధర్‌ ‘కిల్లర్‌’ పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. మర్డర్‌ మిస్టరీ, క్రైౖమ్‌ థ్రిల్లర్‌ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమా ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుండగా జూన్ తొలి వారంలో సినిమా రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా టీజ‌ర్, పాటలు రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ తెచ్చుకోగా ఈ చిత్రం ట్రైలర్ ని  సోమ‌వారం రిలీజ్ చేశారు నిర్మాతలు..


ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.. యాక్ష‌న్ కింగ్ అర్జున్ , హీరో విజయ్ ఆంటోనీ లు పోటాపోటీగా నటించారు.. ఈ చిత్ర కథ ఎంతో ఆసక్తిగా ఉన్నందువల్లే ఈ సినిమా ని తెలుగులో విడుదల చేసేందుకు సిద్ధాయమయ్యాం.. ప్రేక్షకులు కోరుకునే థ్రిల్లర్ అంశాలు అన్ని ఇందులో ఉన్నాయి.. సినిమా ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.. అన్ని వ‌ర్గాల్ని మెప్పించే ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఉన్న చిత్రమిది. అర్జున్ న‌ట‌న సినిమాకే హైలైట్..అన్నారు.




Recent Post