దేవ క‌న్య‌లా ఐశ్వ‌ర్య

  Written by : Suryaa Desk Updated: Tue, May 21, 2019, 11:22 AM

ఫ్రాన్స్‌లోని ఫ్రెంచ్‌ రివేరా నదీ తీరాన ఉన్న కేన్స్‌ ప్రాంతంలో జరుగుతున్న‌ 72వ అంత‌ర్జాతీయ కేన్స్ ఉత్స‌వాలలో మ‌న బాలీవుడ్ టాప్ హీరోయిన్స్ ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తున్నారు. రెండు రోజుల క్రితం ప్రియాంక‌, దీపికా ప‌దుకొణే , కంగ‌నా వెరైటీ డ్రెస్సుల‌తో రెడ్ కార్పెట్‌పై సంద‌డి చేశారు. ఇక రీసెంట్‌గా గోల్డెన్ గౌన్ డ్రెస్సులో రెడ్‌కార్పెట్‌పై మెరిసింది ఐష్ . సాగ‌ర‌క‌న్య త‌ర‌హాలో ఉన్న గౌన్‌ను ధ‌రించిన ఆమె స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా క‌నిపించారు. కూతురు ఆరాధ్య‌తో స‌హ ఐశ్వ‌ర్య ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌కు హాజ‌రైంది. ఇక మ‌రుస‌టి రోజు ఐశ్వ‌ర్య‌రాయ్ తెలుపు రంగు దుస్తుల‌లో జిగేల్‌మంది. స్వ‌ర్గం నుండి దిగి వచ్చిన దేవ క‌న్య‌లా అనిపించింది. రెడ్ కార్పెట్‌పై తెలుపు దుస్తుల‌తో హోయ‌ల్ పోతున్న ఐశ్వర్య‌రాయ్‌ని చూసిన వీక్ష‌కుల‌కి రెండు క‌ళ్ళు చాల‌లేద‌ట‌. ప్ర‌తి ఏడాది కేన్స్ ఉత్స‌వాల‌లో పాల్గొంటున్న ఐష్ ఈ సారి స‌రికొత్త లుక్స్ తో ఆక‌ట్టుకుంటుంది. మే 25 వ‌ర‌కు కేన్స్ ఉత్స‌వాలు జ‌ర‌గ‌నుండ‌గా, ప‌లు చిత్రాల ప్ర‌ద‌ర్శ‌న జ‌రుగుతుంది. 


 


 
Recent Post